© 2026 nimisham.in

సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే!
సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! ఇటీవలే విమాన ప్రయాణంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకున్నాక తనకూ ఓ విషయం గుర్తొచ్చిందని చెబుతోంది నటుడు షాహిద్ కపూర్ సతీమణి, వ్యాపారవేత్త మీరా కపూర్. అదేంటో కాదు.. గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ సూప్ అని చెబుతోన్న మీరా.. ఈ వంటకం తనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసిందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి ఆదరణ లభించడంతో ఏంటా సూప్ రెసిపీ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.
వ్యాపారవేత్తగా, అమ్మగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది మీరా. ఈ క్రమంలోనే తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి, సౌందర్య చిట్కాలు, ప్రయాణ అనుభవాలు.. వంటివెన్నో పంచుకుంటుంటుంది. అలా తనకెదురైన మరో అనుభవం గురించి తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది మీరా. ఇటీవలే ఓ విమాన ప్రయాణంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకుందామె. ఈ క్రమంలోనే తామిద్దరం ఆయా విషయాల గురించి కాసేపు చర్చించుకున్నామని, ఈ సమయంలోనే గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ హెల్దీ రెసిపీ తనకు గుర్తొచ్చిందంటూ ఆ విశేషాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసిందీ మిసెస్ కపూర్.
‘నా జీవితంలో ఎక్కువ భాగం రక్తహీనతతో ఇబ్బంది పడ్డా. దీన్నుంచి బయటపడేందుకు ఏదైనా చిట్కా పాటించాలనుకున్నా. అప్పుడే ఓ సందర్భంలో స్మృతీ ఇరానీ పంచుకున్న ఓ సూప్ వీడియో నా కంట పడింది. కచ్చితంగా మూడు నెలల పాటు ఆ సూప్‌ని రోజూ అరకప్పు చొప్పున తీసుకున్నా. ఆ తర్వాత చేయించుకున్న రక్త పరీక్షల్లో సానుకూల మార్పులు కనిపించాయి. అలాగని ఇది అంత ఖరీదైన వంటకమేమీ కాదు.. మన వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే సులభంగా దీన్ని తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో చాలామంది మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్లకు ఈ వంటకం ఉపయోగపడుతుందనిపించింది..’ అంటూ మీరా పోస్ట్ చేసిన వీడియోకి చక్కటి ఆదరణ లభిస్తోంది.
అయితే స్మృతీ ఇరానీ చెప్పిన ఆ వంటకం పేరు ‘మునక్కాయ-మసూర్ పప్పు సూప్’. దాన్నెలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⚛ ముందుగా మసూర్ పప్పును కడిగి కొన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి.
⚛ ఈ సమయంలో మునక్కాయను కాస్త పెద్ద ముక్కలుగా, ఇతర కాయగూరల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
⚛ ఇప్పుడు అన్ని పదార్థాల్ని కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసి మూడు విజిల్స్ రానివ్వాలి.
⚛ ఆవిరి పోయాక కుక్కర్ మూత తెరిచి.. ఉడికిన పదార్థాల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కాకపోతే బ్లెండర్లో వేసి కూడా మెత్తగా చేసుకోవచ్చు.
⚛ ఇలా తయారైన సూప్‌లో అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకొని జారుడుగా చేసుకోవాలి. ఆఖర్లో దీన్ని వడకట్టుకుంటే మునక్కాడ పీచు వేరవుతుంది. ఈ సూప్‌ని వేడివేడిగా తాగితే రుచి అదిరిపోతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.