© 2026 nimisham.in

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు.
అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే..
హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి.
విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. ఇక్కడ ఇతర కూరగాయల ధరలు చూస్తే టమాట రూ. 30, వంకాయ రూ. 24, క్యారెట్ రూ. 45, కీరదోస రూ. 50, బీన్స్ అత్యధికంగా రూ. 94కు లభిస్తున్నాయి.
దేశవ్యాప్త సగటు, కారణాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సగటు కిలో ఉల్లి ధర రూ. 49.59కి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో సగటు ఉల్లి ధర రూ. 28.48 ఉండగా, ఇప్పుడు అది 74 శాతానికి పైగా పెరిగింది.
అయితే, ఈ ధరల పెరుగుదలకు దేశంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం కారణం కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయింది. రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీయడం, తదుపరి నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.