© 2026 nimisham.in

బాలీవుడ్లో ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే.
థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా', YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది.
ఆలియా భట్ , శర్వరి వాఘ్ అనే ఇద్దరు నటీమణులు నటించిన ఈ చిత్రం, ఈ స్పై యూనివర్స్‌లో మొట్టమొదటి మహిళా-కేంద్రీకృత స్పై-థ్రిల్లర్. అయితే, ఇంత పెద్ద తారాగణం , భారీ యాక్షన్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆలియా, షర్వరిలతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అందుకే 'ఆల్ఫా' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో దాని ప్రదర్శన తర్వాత, సినిమా విజయంపై సందేహాలు తలెత్తాయి.
ఇప్పుడు, 'ఆల్ఫా' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన తర్వాత, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. థియేటర్లలో విఫలమైన తర్వాత ఓటీటీ 'ఆల్ఫా'కు రెండో అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైనంత మాత్రాన ఒక సినిమా పూర్తిగా ఫ్లాప్ అయినట్లు కాదని 'ఆల్ఫా' మరోసారి స్పష్టం చేసింది. తరచుగా, థియేటర్లలో ప్రేక్షకులను చేరుకోలేని చిత్రాలను ఓటీటీలో భారీ సంఖ్యలో చూస్తున్నారు. 'ఆల్ఫా' ప్రస్తుత ప్రజాదరణ దీనికి ఒక ఉదాహరణ.
ఈ చిత్రంలో ఆలియా భట్ 'సీత' అనే పవర్ ఫుల్ పెంపుడు కూతురి/ఏజెంట్ పాత్రలో నటించింది. తనను ఒక కరుడుగట్టిన షూటర్‌గా తీర్చిదిద్దిన పెంపుడు తండ్రి ఫతే సింగ్ (బాబీ డియోల్) దుష్ట ప్లాన్లను గ్రహించిన సీత, ఆయనకు ఎదురు తిరిగి శత్రువుగా మారుతుంది. ఈ క్రమంలో మరో ఫిమేల్ ఏజెంట్ (శర్వరీ) తో కలిసి తన తండ్రిపై , అతని నెట్‌వర్క్‌పై ఎలా పోరాడింది, వారికి రా చీఫ్ (అనిల్ కపూర్), మేజర్ కబీర్ (హృతిక్ రోషన్) ఎలా సహాయపడ్డారు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఆలియా భట్ తన కెరీర్లోనే మొదటిసారిగా పూర్తి స్థాయి హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో, స్టంట్స్‌లో నటించింది.
YRF స్పై యూనివర్స్‌లోని 'వార్' మూవీ క్యారెక్టర్ మేజర్ కబీర్‌గా హృతిక్ రోషన్ కనిపించడం సినిమాకు పెద్ద అసెట్. జూలై 3, 2026 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆగస్టు 28, 2026 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ (YRF) స్పై యూనివర్స్‌లో ఫిమేల్ లీడ్‌తో వచ్చిన మొదటి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.