© 2026 nimisham.in
Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్నాలజీ సెక్టార్ కంపెనీ టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్ (TCC Concept Limited) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సెప్టెంబర్ 4గా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఈ కంపెనీ స్టాక్ ఈ ఏడాది 2026 ఫిబ్రవరి నెలలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం విశేషం. ఆరు నెలల్లోనే తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 100 షేర్లు కొని ఉంటే 500 షేర్లుగా మారనున్నాయి.అయితే సెప్టెంబర్ 4వ తేదీకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. 3 రోజుల్లో ఈ కంపెనీ షేర్స్ ఎక్స్ - స్ప్లిట్ ట్రేడింగ్ చేయనున్నాయి. ఆలోపు షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది. ప్రతి ఒక్క షేరు 5 షేర్లుగా మారనున్నాయి. అయితే, అందుకు తగినట్లుగానే ఈ స్టాక్ ధర తగ్గుతుందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కానీ, పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కంపెనీ షేరు గత 6 నెలల కాలంలో 52 శాతం వరకు నష్టపోయింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 225 సమీపంలో ఉన్న షేర్ ధర రూ. 45ల స్థాయికి దిగివస్తుంది.Read Also: Stock Split: 6 నెలల్లోనే పెట్టుబడి ట్రిపుల్.. లక్షకు రూ.3.45 లక్షలు.. ఇప్పుడు 1 షేరు కొంటే 10 షేర్లుగా మారుస్తోన్న కంపెనీ!కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. టీసీసీ కాన్సెప్ట్ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీస్ యాక్ట్ 2013 లోని సెక్షన్ 61కి అనుగుణంగా 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 షేర్స్ గా స్ప్లిట్ చేసేందుకు ఆమోదం లభించింది. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సెప్టెంబర్ 4, 2026గా నిర్ణయించారు. అంటే ఆరోజున ఎక్స్ స్ప్లిట్ ట్రేడింగ్ జరుగుతుంది. దీంతో షేరు ధర స్టాక్ స్ప్లిట్ ప్రకారం సవరిస్తారు.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ లో TCC కాన్సెప్ట్ షేరు ధర 0.92 శాతం లాభంతో రూ. 225.30 వద్ద ముగిసింది. అయితే ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీన 1.79 శాతం లాభంతో రూ.229.19 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 526.40 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 218.05 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 4 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఈ షేరు 22 శాతం పడిపోయింది. అదే విధంగా గత ఆరు నెలల్లో 47 శాతం పడింది. ఇక గత 7 నెలల కాలంలో 52 శాతం నష్టపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 1070 కోట్ల వద్ద ఉంది.Read Also: Bonus Shares: ధర 4 రూపాయలే.. 7 షేర్లు ఉచితంగా ఇస్తోన్న కంపెనీ.. సెప్టెంబర్ 4 రికార్డ్ తేదీగా నిర్ణయం!Disclaimer: ఈ కథనం సమాచారం అందించేందుకే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.