© 2026 nimisham.in

‘ఉప్పెన’తో సంచలన విజయం అందుకుని, ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ వంటి భారీ హిట్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన బుచ్చిబాబు సానా, మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చిబాబు, రవితేజతో సినిమా చేయాలనే తన కోరికను బహిరంగంగా వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి రాకముందు, ఒక రచయితగా నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు రాసుకున్న మొట్టమొదటి కథ రవితేజ గారి కోసమే. ఆయన ఎనర్జీని, యాటిట్యూడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇప్పటికీ ఆ కథ నా దగ్గర ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఆ కథను ఆయనకు పూర్తిగా వినిపిస్తాను. రవితేజ గారితో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక" అని అన్నారు. బుచ్చిబాబు మాటలకు అక్కడున్న మాస్ మహారాజా అభిమానులు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు.సుకుమార్ శిష్యుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు, రెండో సినిమా ‘పెద్ది’తో రామ్‌చరణ్‌కు కెరీర్లోనే ఒక మైలురాయి లాంటి విజయాన్ని అందించారు. దీంతో టాలీవుడ్లో ఆయన మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారారు. ఆయన దర్శకత్వంలో పనిచేసేందుకు అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి బుచ్చిబాబు ఒక కథ వినిపించారని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో తాను ఎంతో ఇష్టపడే రవితేజతో