© 2026 nimisham.in

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సంపేటలో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన గొప్ప నాయకుడు పెద్ది అని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, "ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ప్రధానం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేలా పనిచేశారు" అని వ్యాఖ్యానించారు. ఆయన అంత్యక్రియలకు పోటెత్తిన అశేష జనవాహిని, ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డి, జులై 31న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్గా సేవలందించడంతో పాటు, 2018-2023 మధ్య కాలంలో నర్సంపేట ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు.కాగా, నిన్న ఆదివారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రకటించిన రూ. 2.25 కోట్ల ఆర్థిక