© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Akhil to Samantha Via Chaitu Kiran Abbavaram: ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లి తర్వాత కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్న స్టార్స్ సంఖ్య పెరిగింది. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 11 యేళ్లు కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మాత్రమే ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత చేసిన ‘ఏజెంట్’ అఖిల్ కెరీర్లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ తర్వాత మూడేళ్ల లాంగ్ తర్వాత ‘లెనిన్’ మూవీతో పలకరించాడు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అఖిల్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా జైనబ్ రవ్జీని పెళ్లి చేసుకున్న తర్వాతే అయ్యగారి కెరీర్ స్పీడ్ అందుకుంది.
పెళ్లి తర్వాత మా ఇంటి బంగారంతో సామ్ గ్రాండ్ రీ ఎంట్రీ..
అంతకు ముందు సమంత కూడా నాగ చైతన్యతో విడాకుల తర్వాత దర్శకుడు రాజ్‌ను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత తన భర్త అందించిన కథతో నందిని రెడ్డి డైరెక్షన్లో చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది.
నాగచైతన్య కూడా సమంతతో విడాకుల తర్వాత శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. శోభిత ఇంట అడుగుపెట్టిన మహిమో కానీ .. అఖిల్ హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. త్వరలో ‘వృషకర్మ’ సినిమాతో చైతూ పలకరించబోతున్నాడు.
ఈ ముగ్గురు కంటే ముందే కిరణ్ అబ్బవరం .. రహస్య గోరఖ్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ‘క’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సస్ అందుకుంది. తొలిసారి కిరణ్ అబ్బవరం ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం తన పేరు కలిసొచ్చేలా ‘క’ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఈ రకంగా ఈ నలుగురు కెరీర్ పెళ్లి తర్వాత ఊపందుకోవడం విశేషమనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.