© 2026 nimisham.in

Nabha Natesh Nagabandham Movie: వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన కన్నడ బ్యూటీ నభా నటేష్.. తాజాగా 'నాగబంధం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆ సినిమాలోని నభా నటేష్ ఫొటోలు వైరల్ గా మారాయి.
'నాగబంధం' పూర్తిగా ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సినిమా అయినా.. వాణిజ్య అంశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ నభా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంతో భారీ విజయంతో ఇండస్ట్రీకి నభా నటాష్ రీఎంట్రీ ఇచ్చినట్లు ఉందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.
మరోవైపు 'కార్తికేయ-2' ఫేమ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'స్వయంభూ' సినిమాలోనూ నభా నటేష్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ చారిత్రక చిత్రంలో 'సుందర వల్లి' అనే విలక్షణమైన పాత్రలో హీరోయిన్ నభా నటేష్ మెరిసిపోగా.. ఆమె రాణి గెటప్‌లో అందంగా, హుందా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శాండల్‌వుడ్ స్టార్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి', 'RRR' చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సెంథిల్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించారు.
'స్వయంభూ' సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇప్పుడు ఆ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. 'నాగబంధం' విజయం తర్వాత, నభాకు వరుసగా పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఆమె టాలీవుడ్లో మళ్లీ సందడి చేస్తుంది.