© 2026 nimisham.in
Tata Mutual Fund: బంగారంలో మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు టాటా మ్యూచువల్ ఫండ్ తీపి కబురు అందించింది.
తమ టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF), టాటా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Tata Gold ETF FoF) స్కీమ్లలో పెద్ద ఇన్వెస్టర్లకు లంప్ సమ్ రూపంలో చేసే పెట్టుబడులపై విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులను బంగారంపై పెట్టుబడి పెట్టే వెసులుబాటు కలిగింది.పెట్టుబడులు పునః ప్రారంభంగతంలో మార్కెట్ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా పసిడి సరఫరా, ధరల అస్థిరత కారణంగా పెద్ద ఇన్వెస్టర్లు ఒకేసారి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడంపై పరిమితులు విధించారు. అయితే, ప్రస్తుతం పసిడి మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అనంతరం, టాటా మ్యూచువల్ ఫండ్ యాజమాన్యం ఈ సబ్స్క్రిప్షన్లను తిరిగి యథాతథంగా అనుమతించాలని నిర్ణయించింది.సవరించిన కొత్త నిబంధనలు ఆగస్టు 21, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) తెలిపింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన క్రమంలో ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.జూన్ 5న, టాటా మ్యూచువల్ ఫండ్ చేసిన ప్రకటన ప్రకారం.. రూ. 25 కోట్ల పెట్టుబడితో టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF)లో నేరుగా పెట్టుబడులు పెట్టే భారీ పెట్టుబడిదారుల సబ్స్క్రిప్షన్ లావాదేవీలపై జూన్ 8, 2026 నుంచి తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. Tata Gold ETF అనేది దేశీయ బంగారం ధరను అనుసరించే ఒక ఓపెన్-ఎండెడ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్. Tata Gold ETF FOF అనేది Tata Gold ETFలో పెట్టుబడి పెట్టే ఒక ఓపెన్-ఎండెడ్ 'ఫండ్-ఆఫ్-ఫండ్స్' పథకం.ఇన్వెస్టర్లకు కలిగే ప్రయోజనాలుపెద్ద ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా తమ వద్ద ఉన్న నిధులను ఒకేసారి టాటా గోల్డ్ ఈపీఎఫ్ ఎఫ్ఓఎఫ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లతో పాటు లంప్ సమ్ సౌకర్యం లభిస్తుంది. సిప్ కొనసాగుతుండగానే మార్కెట్ కరెక్షన్లు లేదా బంగారం ధరలు తగ్గినప్పుడు ఏకమొత్తంలో డిప్స్ కొనుగోలు చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. డిజిటల్ లేదా ఈటీఎఫ్ రూపంలో గోల్డ్ కొనుగోలు చేయడం వల్ల లాకర్ ఛార్జీలు, తయారీ కూలీ లేదా స్వచ్ఛత గురించిన ఆందోళనలు ఉండవు.