
రేణు దేశాయ్ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్ కి జోడీగా
రేణు దేశాయ్ `బద్రి` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే పవన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు సాగిన వీరి ప్రేమ కథ.. ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లింది. అయితే వీరికి పెళ్లికి ముందే అకీరా నందన్ జన్మించాడు. అప్పటికే పవన్ కి నందినితో వివాహం జరిగింది. ఆమెతో విడాకులు రావడానికి టైమ్ పట్టిన నేపథ్యంలో రేణు దేశాయ్‌ని లేట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అన్ని రోజులు ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకే అకీరా నందన్ జన్మించాడు. పెళ్లి తర్వాత మూడేళ్లు ఉన్న ఈ జంట 2012లో విడిపోయింది. ఆ తర్వాత రష్యా నటి అన్నా లెజినోవాని పవన్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రేణు దేశాయ్ టాలీవుడ్ ఎంట్రీ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మొదట మోడలింగ్ చేసే రేణు దేశాయ్‌ని ముంబాయి నుంచి తీసుకొచ్చింది దర్శకుడు గీతా కృష్ణ అంట. ఆయన తన `టైమ్` మూవీ కోసం తీసుకొచ్చాడట. ఆడిషన్ చేశాక, సెట్ కాలేదని రిజెక్ట్ చేశాడట. తర్వాత సినిమా చేద్దామని చెప్పాడట. అదే సమయంలో ప్రభుదేవా ఆమెని అడిగారట. దీంతో గీతా కృష్ణ తీసుకొవచ్చు అని సజెస్ట్ చేశాడట. దీంతో ప్రభుదేవా హీరోగా తమిళంలో రూపొందిన `జేమ్స్ పాండ్` అనే చిత్రంలో హీరోయిన్గా మొదట రేణు దేశాయ్ ఎంపికైందట. `జేమ్స్ పాండ్` మూవీలో ఆమె యాక్టింగ్‌ని చూసి పూరీ జగన్నాథ్ `బద్రి` మూవీకి ఎంపిక చేశాడట. పవన్‌తో `బద్రి` చేసేనాటికి ఆ మూవీ షూటింగ్ అయిపోయిందట. కాకపోతే రిలీజ్ డిలే అయ్యిందని సమాచారం. ఈ లోపు రేణు దేశాయ్ నటనని చూసిన పూరీ జగన్నాథ్ `బద్రి`లో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు గీతా కృష్ణ తెలిపారు. పూరీ ఈ మూవీని వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఎంతటి పెద్ద విజయం